మామిడి

మామిడి (ఆంగ్లం: Mango) కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. మామిడిపళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్, విటమిన్ సి, కాల్షియం ఎక్కువ.దీని ఆకులను "చూత పత్రి" అని కూడా అంటారు. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షంగా పెరుగుతుంది. భారతదేశంలో వంద రకాలకుపైగా మామిడిపళ్ళు దొరుకుతాయి.[1]

మామిడి (మ్యాంగో)
చెట్టుపై పచ్చిగా ఉన్న మామిడి కాయలు
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: సపిండేలిస్
కుటుంబం: అనకార్డియేసి
జాతి: మాంగిఫెరా
లిన్నేయస్
జాతులు

సుమారు 35 రకాలు - [| వీడియో వీక్షించండి]

చూతపత్రి
2005 లో అధికంగా మామిడి ఉత్పత్తి చేసిన దేశాలు
దేశంహెక్టేరులు
భారతదేశం1,600,000
చైనా433,600
థాయిలాండ్285,000
ఇండొనీషియా273,440
మెక్సికో173,837
ఫిలిప్పీన్స్160,000
పాకిస్తాన్151,500
నైజీరియా125,000
గునియా82,000
బ్రెజిల్68,000
వియత్నాం53,000
బంగ్లాదేశ్51,000
ప్రపంచం మొత్తం3,870,200
వనరు:
యు.ఎన్. ఆహారం మరియు వ్యవసాయ సంస్థ. (FAO)

మామిడిచెట్టు వివరణ

ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై (30) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు పది (10) నుండి (35) సెంటి మీటర్ల పొడవు ఆరు (6) నుండి పది (10) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుళ్లు లేత తేనె రంగు నుండి ముదురు కాఫీ రంగుకు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి. పూల గుత్తులు పది (10) నుండి నలభై (40) సెంటి మీటర్ల పొడవు ఉంటాయి. పూవు చిన్నదిగా ఐదు (5) నుండి (10) మిల్లి మీటర్లు పొడవు ఐదు (5) రెక్కలు కలిగి లేలేత సువాసనతో ఉంటాయి. పుష్పించడం పూర్తి ఐన తరువాత కాయలు రూపు దిద్దుకొని మూడు (3) నుండి ఆరు (6) మాసాలలో పక్వానికి వస్తాయి.

పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలే వైపు కొంచెం లేత ఎరుపు రంగుతోను ఇంకొక వైపు పసుపు రంగుతోను ఉంటాయి. ఇవి తియ్యని సువాసనతో ఉంటాయి. ఏడు (7) నుండి (12) సెంటి మీటర్ల వ్యాసం, పది (10) నుండి ఇరవై ఐదు (25) సెంటి మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. రెండున్నర (2.5) కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పండు మధ్యలో పీచు తోను, పీచు లేకుండాను దృఢమైన ముట్టె ఉంటుంది. అది ఒకటి (1) నుండి (2) మిల్లీమీటర్లు మందంతో, పల్చటికాగితం లాంటి పొర ఉన్న విత్తనంతో (జీడి) ఉంటుంది. విత్తనం నాలుగు (4) నుండి ఏడు (7) సెంటి మీటర్ల పొడవు, మూడు (3) నుండి నాలుగు (4) సెంటి మీటర్ల వెడల్పు, ఒక (1) సెంటీమీటర్ మందం కలిగి ఉంటుంది.

మామిడి ఉపయోగాలు

మామిడి, ముడి
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 70 kcal   270 kJ
పిండిపదార్థాలు     17.00 గ్రా.
- చక్కెరలు  14.8 గ్రా.
- పీచుపదార్థాలు  1.8 గ్రా.  
కొవ్వు పదార్థాలు0.27 గ్రా.
మాంసకృత్తులు .51 గ్రా.
విటమిన్ A  38 μg4%
థయామిన్ (విట. బి1)  0.058 mg  4%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.057 mg  4%
నియాసిన్ (విట. బి3)  0.584 mg  4%
పాంటోథీనిక్ ఆమ్లం (B5)  0.160 mg 3%
విటమిన్ బి6  0.134 mg10%
ఫోలేట్ (Vit. B9)  14 μg 4%
విటమిన్ సి  27.7 mg46%
కాల్షియమ్  10 mg1%
ఇనుము  0.13 mg1%
మెగ్నీషియమ్  9 mg2% 
భాస్వరం  11 mg2%
పొటాషియం  156 mg  3%
జింకు  0.04 mg0%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు

ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్ (Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.

మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం (15%) చక్కెర, ఒక శాతం (1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి (A, B, C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు (బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. మామిడి కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు (ఊరగాయ లు) తయారు చేస్తారు.

ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను (వీటిని మామిడి ఒరుగు అంటారు) సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటలలో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పైతో చేస్తున్నారు. థాయ్ లాండ్ లో భోజనానంతర ఆహారం (డిసర్ట్) తో చేర్చి అందిస్తారు.

మామిడి.. క్యాన్సర్‌ నివారిణి

మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికడుతుందని మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు.

ఔషదంగా మామిడి ఉపయోగాలు

ఔషధోపయోగాలు 
  • పాదాల పగుళ్ళు: మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. దీనితోపాటు ప్రతిరోజూ బూట్లు, సాక్సులు ధరించటం ముఖ్యం. పంటినొప్పి, చిగుళ్ళ వాపు: రెండు కప్పులు నీళ్ళు తీసుకొని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంత సేపు మరగ నివ్వాలి. స్టవ్‌మీద నుంచీ దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమను కుంటే ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేయవచ్చు.
  • కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో భద్రపరచుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
  • ఆర్శమొలలు (రక్తయుక్తం) : అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగు మీది తేటతో కలిపి తీసుకోవాలి.
  • జ్వరం: మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
  • బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనెను గాని, నువ్వుల నూనెను తీసుకొని మామిడి కాయలను ఊరేయండి. ఇలా సంవత్సరంపాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి.
  • చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకులనుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ముక్కునుంచి రక్తస్రావం: మామిడి జీడినుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి.
  • కంటినొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పులపైన సుఖోష్టంగా ఉండేలా వేడిచేసి మూసి వుంచిన కన్నుపైన ‘పట్టు’ వేసుకోవాలి.
  • దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
  • కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.
  • ఎగ్జిమా: మామిడి చెట్టు బెరడును, నల్ల తుమ్మ బెరడును తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోండి. రోజూ పిడికెడంత మిశ్రమాన్ని తీసుకొని అర లీటరు నీళ్ళలో వేసి ఆవిరి వచ్చేవరకూ మరిగించి, ఆవిరిని ఎగ్జిమా సోకిన ప్రదేశానికి తగిలేలా చేయాలి. తడి ఆరిన తర్వాత నెయ్యి రాసుకొని మర్ధనా చేసుకోవాలి.
  • పుండ్లు: మామిడి బెరడును చిన్న చిన్న పీలికలు అయ్యేంతవరకూ దంచి, నీళ్ళలో వేసి మరిగించండి. ఈ డికాక్షన్‌తో పుండ్లను, వ్రణాలను కడిగితే త్వరగా మానతాయి.
  • నీరసం: మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి ఆస్వాదించండి.
  • వడదెబ్బ: పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్ళను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా ఎండల తీక్షణతవల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.
  • చెమట కాయలు: రెండు పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్ళుపోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించండి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గి, ఒళ్లు పేలకుండా ఉంటుంది.
  • మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్ళను సమానభాగాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి ఉంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకొని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకారి.
  • స్టీృన్ (ప్లీహం) పెరుగుదల, కాలేయపు సమస్యలు: గుప్పెడు మామిడి గుజ్జుకు చిన్న చెంచాడు తేనెను కలుపుకొని మూడుపూటలా తాగండి. కాలేయపు సమస్యల్లో మామిడి గుజ్జును పాలతో కలిపి తీసుకోవాలి.
  • విరేచనాలు: మామిడి టెంకను పగులకొట్టి దీనిలోని జీడిని వేరుపరిచి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దీని బరువుకు సమానంగా సోపు (శతపుష్ప) గింజలను తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా చూర్ణం చేసుకోవాలి. తర్వాత రెండు చూర్ణాలను బాగా కలిపి పలుచని గుడ్డతో జల్లించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. దీనితోపాటు మామిడి బెరడు లోపలి పొరను పేస్టులాగా చేసి బొడ్డు చుట్టూ రాస్తే ఇంకా మంచిది. మామిడి జీడే కాకుండా మామిడి పూత కూడా విరేచనాలను ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎండిన మామిడి పూతను తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇంతే కాకుండా మామిడి పూతను, దానిమ్మ పువ్వులను కలిపి ఎండించి, పొడిచేసి మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు.
  • “పచ్చి మామిడి” వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.
  • వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.
మామిడితో గ్లూకోజు అదుపు!

చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు. ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయిలు మెరుగు పడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. రొమ్ముకణాల్లో వాపును అదుపు చేయటానికీ తోడ్పడు తున్నట్టూ బయటపడింది.

రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒకొకరికి 10 గ్రాముల మామిడి తాండ్రను (ఇది 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానం) తినిపించారు. పన్నెండు వారాల తర్వాత పరిశీలించగా.. వీరి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడిపండ్లు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్టు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి అని అధ్యయన నేత డాక్టర్‌ లూకాస్‌ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏయే పాలీఫెనోలిక్‌ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు. మరోవైపు- మామిడిలోని పాలీఫెనాల్స్‌ రొమ్ముల్లోని క్యాన్సర్‌, క్యాన్సర్‌ రహిత కణాల్లో వాపు ప్రతిస్పందనను అదుపుచేస్తున్నట్టు ఇంకో అధ్యయనంలో బయట పడింది

ఇతర వ్యాపారాలలో మామిడి

మామిడి చెట్టు
మామిడికాయ కోరు పచ్చడి

భారతదేశంలో మామిడి తాండ్రను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్ని సీసాలు, మరియు, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ పండ్ల రసాల అంగడిలో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీంలో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్ లో మామిడి ముక్కలను వేస్తారు. మామిడి పళ్లను మాగ పెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తారు. రైతుల ఆతృత, వ్యాపారుల లాభాపేక్ష వెరసి మామిడి పండ్ల అసలు రంగు, రుచిని పోగొడుతున్నాయి. సరైన రీతిలో పండకుండా కృత్తిమ మార్గాల్లో విష ప్రయోగాలు చేస్తున్నారు.

కచ్చితంగా ప్రారంభం ఎక్కడో ఎవరికీ తెలియక పోయినా శిలాజాల ఆధారంగా ఇరవైఐదు (25) నుండి (30) మిలియన్ సంవత్సరాల పూర్వం మామిడి ఉన్నట్లు రుజువులు ఉన్నాయి. పురాణాలలో, వేదకాలంలో ఉన్నట్లు వర్ణనలు ఉన్నాయి. ఇండియా, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్ మామిడి చెట్టు జన్మ స్థలంగా విశ్వసించ బడుతోంది.

సంప్రదాయంలో మామిడి

భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకుల తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణం తోటే ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోను మామిడి కాయ ఆకారం చోటు చేసుకుంది.

ఇతర ఉపయోగాలు

మామిడి చెట్టు

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

  1. ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్ (Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
  2. మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం (15%) చక్కెర, ఒక శాతం (1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి (A, B, C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు (బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. ఇది చాలామందికి నోరూరించే ఆహారం.
  3. సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు.

ఆయుర్వేదంలో

మామిడికాయ కోరు పచ్చడి
మామిడికాయ ముక్కల పచ్చడి
  1. మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
  2. నిద్రలేమి : నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఓ మామిడి పండును తినండి. హాయిగా నిద్ర పడుతుందని వైద్యులు అంటున్నారు.
  3. శరీరం కాలినప్పుడు : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలిన గాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది.
  4. దంతాలు గట్టిగా ఉండాలంటే : మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు.

పేరు పుట్టుపూర్వోత్తరాలు

మామిడి చెట్టు

తమిళంలోని మాంగాయ్, లేక మలయాళంలోని మాంగా అనే పేరు. పోర్చుగీసులు ఇండియాకు వచ్చిన తరువాత పోర్చుగీసుల వలన వ్యాపించినదని గుర్తించారు. పొర్చుగీసు వాళ్లు దీనిని మాంగా పిలవడం దీనికి కారణం.

చిత్రమాలిక

మామిడి జాతులు

There are many species of mango, including:

  • Mangifera acutigemma
  • Mangifera altissima
  • Mangifera andamanica
  • Mangifera austro-indica
  • Mangifera austro-yunnanensis
  • Mangifera blommesteinii
  • Mangifera bullata
  • Mangifera caesia
  • Mangifera camptosperma
  • Mangifera campnospermoides
  • Mangifera casturi
  • Mangifera collina
  • Mangifera decandra
  • Mangifera dewildei
  • Mangifera dongnaiensis
  • Mangifera flava
  • Mangifera foetida
  • Mangifera gedebe
  • Mangifera gracilipes
  • Mangifera griffithii
  • Mangifera hiemalis
  • Mangifera indica
  • Mangifera kemanga
  • Mangifera lalijiwa
  • Mangifera laurina
  • Mangifera longipes
  • Mangifera macrocarpa
  • Mangifera magnifica
  • Mangifera mekongensis
  • Mangifera minutifolia
  • Mangifera monandra
  • Mangifera nicobarica
  • Mangifera odorata
  • Mangifera orophila
  • Mangifera pajang
  • Mangifera paludosa
  • Mangifera parvifolia
  • Mangifera pedicellata
  • Mangifera pentandra
  • Mangifera persiciformis
  • Mangifera quadrifida
  • Mangifera rubropetala
  • Mangifera rufocostata
  • Mangifera siamensis
  • Mangifera similis
  • Mangifera sumbawaensis
  • Mangifera superba
  • Mangifera swintonioides
  • Mangifera sylvatica
  • Mangifera taipa
  • Mangifera torquenda
  • Mangifera transversalis
  • Mangifera zeylanica

మామిడి రకాలు

  1. బంగినపల్లి
  2. నీలం
  3. చందూరా
  4. రుమానియా
  5. మల్గోవా
  6. చక్కెర కట్టి
  7. గిర్ కేసర్ మామిడి
  8. అంటు మామిడి లేక చిలక ముక్కు మామిడి లేక బెంగుళూరు మామిడి.
  9. రసాలు.
  10. చిన్న రసాలు
  11. పెద్ద రసాలు
  12. చెరుకు రసాలు
  13. షోలాపూరి
  14. అల్ఫాన్సా
  15. నూజివీడు రసం
  16. పంచదార కలశ
  17. కోలంగోవా
  18. ఏండ్రాసు
  19. సువర్ణరేఖ
  20. పండూరివారి మామిడి
  21. కలెక్టరు
  22. అంపిరేడు లేక కొండమామిడి.
  23. ఇమాం పసంద్
  24. దసేరి
  25. జహంగీర్
  26. ఢిల్లీ పసంద్
  27. నూర్జహాన్
  28. బేనీషా
  29. హిమాని
  30. నీలీషాన్ (బేనీషా + నీలాన్ని కలిపి అభివృద్ధి చేసినది)
  31. పుల్లూర
  32. ఇంటి పెరడులో మామిడి చెట్టు
  33. కొబ్బరి మామిడి
  34. చాకులు
  35. ఆచారి
  36. జలాలు

ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయించడం ఒక మామిడి చెట్టుకే సాధ్యం. ఇంటి లోని పెరడులో పెంచే చెట్టుకు ఈ విధంగా ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయిస్తే అన్ని రకాలాను తిన్నట్టు ఉంటుంది. "ట్రీ టాప్ గ్రాఫ్టింగ్" ద్వారా ఇది సాధ్యం. బాగా ఎదిగిన పెద్ద మామిడి చెట్టుకున్న పెద్ద కొమ్మలను కొట్టి వేయాలి. మూడు నెలలకు, కొట్టిన ప్రతి కొమ్మకు కొన్ని చిగుర్లు వస్తాయి. అవి చేతి వేలు ప్రమాణం వచ్చి నపుడు వాటిని సన్నటి పదునైన చాకుతో ఏట వాలుగా కోయాలి. మనకు కావలసిన అనేక రకాల మామిడి రకాల చెట్టు కొమ్మల నుండి చేతి వేలి లావున్న కొమ్మలను ఏటవాలుగా కోసి ( నాలుగు అంగుళాల పొడవు) ఈ చెట్టుకు కోసిన కొమ్మలకు అతికించి గట్టిగా కట్టాలి. ఆవిధంగా అన్నికొమ్మలకు కావలసిన రకాల కొమ్మలను అతికించి కట్టాలి. కొంత కాలానికి కొత్తగా అతికించిన కొమ్మ చిగుర్లు వేసి పెద్దదై దానికి సంబంధించిన కాయలను కాస్తుంది. ఎన్ని రకాల కొమ్మలను అతికించామో అన్ని రకాల కాయలు కాస్తుంది. ప్రతి ఏడు ఇలా కావలసిన రకాల కొమ్మలను అంటు కట్టి రకరకాల కాయలను కాయించ వచ్చు.

అంపిలేపి(కొండమామిడి)

అంపిలేపి (కొండ మామిడి) చెట్టు దాదాపు 27 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఈ చెట్టు బెరడు మరియు కాయలను ఆయుర్వేద ఔషధాలలోను వివిధ మెడిసిన్ల తయారిలోను విరివిగా వినియోగిస్తున్నారు.

అంపిలేపి (కొండ మామిడి) చెట్టు Spondias mangifera

ఇవీ చూడండి

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.